వైఎస్‌ షర్మిలకు 14 రోజుల రిమాండ్‌..నేడు దిష్టిబొమ్మల దహనం

-

నిన్న ఉదయం నుండి అత్యంత నాటకీయంగా జరిగిన పరిణామాలు చివరికి తెలంగాణ వైసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను జైలుపాలు చేశాయి. షర్మిల పోలీసులపై దాడి చేసిన కేసులో ఆమెపై కేసులు నమోచు చేయడం జరిగింది. కాగా ఆ తర్వాత కొన్ని సెక్షన్ ల కింద షర్మిలపై మరియు ఆమె కార్ డ్రైవర్ పై కేసులు పెట్టి.. ఈమెను నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్లే ముందు గాంధీ హాస్పిటల్ లో ఆమెకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

అనంతరం నాంపల్లి కోర్ట్ లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే.. వైఎస్‌ షర్మిలకు 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. అనంతరం చంచల్ గూడ జైలుకు షర్మిలను తరలించారు పోలీసులు. కాగా, వైఎస్ షర్మిల అరెస్ట్ నిరసనగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు నిచ్చింది YSR తెలంగాణ పార్టీ. దీంతో ఇవాళ అన్ని నియోజక వర్గాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version