BREAKING : కాసేపట్లో వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేయనున్నారు. ఇందులో భాగంగానే…నేడు లోటస్ పాండ్ లో వైఎస్సార్ టిపి కీలక సమావేశం జరుగనుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిక పై కీలక ప్రకటన చేయనున్నారు వైఎస్ షర్మిల. ఈ మేరకు ఇవాళ లోటస్ పాండ్ లో వైఎస్సార్ టిపి కీలక సమావేశం జరుగనుంది. ఇక మధ్యాహ్నం ఇడుపులపాయకు వైఎస్ షర్మిల (YS Sharmila) పయనం అవుతారు.
YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి కుటుంబ సమేతంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలు దేరుతారు.ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకొని రోడ్డు మార్గం ద్వారా ఇడుపుల పాయ ఎస్టేట్ లోని YSR ఘాట్ వద్ధకు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. ఇక ఘాట్ వద్ద కుమారుడు వైఎస్ రాజారెడ్డి గారి వివాహ పత్రికను ఉంచి నివాళులు అర్పిస్తారు.