జూలై 8న కాంగ్రెస్‌ పార్టీలోకి వైఎస్‌ షర్మిల ?

-

జూలై 8న కాంగ్రెస్‌ పార్టీలోకి వైఎస్‌ షర్మిల వెళ్లనున్నారని విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే, ఇప్పటికే వైఎస్ షర్మిలకు ఫోన్ చేశాడు రాహుల్ గాంధీ సన్నిహితుడు కేసీ వేణుగోపాల్. ఇక ఇవాళ సోనియా గాంధీ తో ఫోన్ మాట్లాడనున్నారు వైఎస్ షర్మిల.

ఇవాళ సాయంత్రం సోనియా గాంధీ తో ఫోన్ మాట్లాడనున్నారు వైఎస్ షర్మిల. జూలై 8న ఇడుపులపాయ లోని వైఎస్సార్ సమాధి వద్ద వైఎస్సార్ జయంతి సందర్బంగా నివాళి అర్పించే యోచన లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారు. అదే రోజున కాంగ్రెస్‌ పార్టీలోకి వైఎస్‌ షర్మిల వెళ్లనున్నారని విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఇక అటు వైఎస్‌ షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌ తో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు మాట్లాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version