మునుగోడు ఉప ఎన్నికపై వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు ఉపఎన్నిక అహకారం, అధికారమదం కోసం వచ్చిన ఎన్నిక. ప్రజలంతా ఈ ఎన్నికను బైకాట్ చేయాలని YSR తెలంగాణ పార్టీ పిలుపునిస్తుందని తెలిపారు వైఎస్ షర్మిల.. ప్రజల కోసం ఏనాడూ రాని నాయకులు.. ఓట్ల కోసం వస్తున్నారు. ప్రజలంతా ఈ ఎన్నికను బహిష్కరించాలని కోరారు షర్మిల.
అలాగే..నా గతం తెలంగాణలోనే. నా భవిష్యత్తు కూడా తెలంగాణలోనే. నేను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనే. ఇక్కడే పెరిగా, ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే పెళ్లి చేసుకున్నా. ఈ గడ్డ ప్రజలకు సేవ చేయడం నా బాధ్యత అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. సమస్యలను పట్టించుకోని పాలకపక్షం,స్వార్థం కోసం అమ్ముడుపోయిన ప్రతిపక్షాలు ఉన్నన్ని రోజులు అభివృద్ధి జరగదు. ఎల్లవేళలా ప్రజలపక్షాన నిలబడేది YSR తెలంగాణ పార్టీ మాత్రమేనన్నారు షర్మిల.