టెలిఫోన్ రిసీవర్ వైరుతో ఆభరణాలు.. ధర చూస్తే మతిపోవాల్సిందే..

-

ఫ్యాషన్ రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఫ్యాషన్ డిజైనర్స్ పెరగడమో, ఫ్యాషనబుల్ గా కనిపించాలన్న కోరిక పెరగడమో ఏమో కానీ, కొత్త కొత్త రకాల ఆభరణాలు, ఫ్యాషన్ వస్తువులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇందులో కొన్నింటికీ గిరాకీ విపరీతంగా ఉంటే మరికొన్నింటికీ అత్యల్పంగా ఉంది. మార్కెట్ అత్యల్పంగా ఉన్నప్పటికీ అవి ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అలాంటి ఒకానొక ఆభరణం ప్రస్తుతం సోషల్ మీడీయాలో చర్చకి తెరలేపింది. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్న ఈ ఆభరణం గురించి తప్పక తెలుసుకోవల్సిందే.

టెలిఫోన్, రిసీవర్ ని కనెక్ట్ చేసే కార్డుతో తయారు చేసిన నెక్లెస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అవును, మీరు వింటున్నది నిజమే. టెలిఫోన్ కార్డులా కనిపిస్తున్నటువంటి నెక్లెస్ మార్కెట్లో ఉంది. చూడడానికి టెలిఫోన్ కార్డ్ వైర్ లాగే ఉంది కదా. దీన్ని నెక్లెస్ గా ధరించడమే కాదు, చెవికి దుద్దులుగా కూడా పెట్టుకోవచ్చట. ఇంతకీ ఇదెవరు తయారు చేసారో తెలుసా? బొట్టెగా వెనెట అనే లక్సరీ ఫ్యాషన్ బ్రాండ్, ఈ ఆభరణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంతకీ దీని ధర చెప్పనేలేదు కదా.

2వేల డాలర్లు.. అవును మీరు చదువుతున్నది నిజమే. అక్షరాల 1,47, 007రూపాయలు. టెలిఫోన్ కార్డ్ వైర్ తో తయారు చేసిన దానికి ఇంత రేటా అని అనుకోవచ్చు. నిజమే, దీనిపై అనేక మంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఒకానొక ఇన్స్టాగ్రామ్ యూజర్, 5రూపాయలకి దొరికే మామూలు టెలిఫోన్ కార్డులని ఒక వైపు పెట్టి, మరోవైపు 2వేల రూపాయల టెలిఫోన్ కార్డ్ వైర్ ఆభరణాన్ని పెట్టాడు. అంత తక్కువ డబ్బులు విలువ చేసే వస్తువుని పాపులర్ బ్రాండ్ అయినంత మాత్రాన అంత ఎక్కువ ధరకి అమ్మకానికి ఉంచుతారా అంటూ విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి ఫ్యాషన్ రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణకి ఊపు వచ్చిందని చెప్పుకోవచ్చు. మరికొన్ని రోజులు పోతే మరిన్ని చిత్ర విచిత్రమైన ఫ్యాషన్ చూడాల్సి వస్తుందేమో!

Read more RELATED
Recommended to you

Exit mobile version