తెలుగు అకాడమీ జరిగిన అవినీతి కేసు గంట గంటకు కీలక మలుపులు తిరుగుతోంది. ఇక తాజాగా ఏకంగా తెలంగాణ అకాడమీ డైరెక్టర్ సోమి రెడ్డి పై వేటు పడింది. అకాడమీ బాధ్యతల నుంచి సోమి రెడ్డిని తప్పిస్తూ… తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
అంతే కాదు… తెలుగు అకాడమీ బాధ్యతలు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ దేవ సేనకు అప్పగిస్తూ… నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. ఫుల్ అడిషనల్ ఛార్జ్ నుంచి సోమి రెడ్డిని తప్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దేవ సేనకు తెలుగు అకాడమీ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
కాగా.. తెలుగు అకాడమీ కేసులో ముగ్గురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే… బ్యాంక్ లనుండి 64 కోట్ల మేరకు ఎఫ్డీ ల రూపంలో కాజేసినట్లు తేల్చారు పోలీసులు. సొసైటీ లో తెలుగు అకాడమీ పేరుతో ఫేక్ ఐడి లు క్రియేట్ చేసి అకౌంట్స్ తెరిచారు నిందితులు. ఈ నేపథ్యంలోనే నిందితులపై సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో మరో రెండు కేసులు నమోదు చేశారు. నిందితులపై 154/2021, U/Sec. 409, 419, 420, 465, 467, 468, 471 ఆర్/డబ్ల్యు 34 ఐపిసి కేసు నమోదు చేశారు పోలీసులు.