అమెరికాలో హరికధలు…

-

హరికధలు..తెలుగు చరిత్రని, సంపదలని, భారతీయ ఔన్నత్యాన్ని ఒకానొక కాలంలో దశదిశలు తెలిసేలా చాటిచెప్పే అద్భుతమైన కార్యక్రమాలు. సినిమాలు పరిచయం అయ్యాక, టీవీలు వచ్చేశాక, టెక్నాలజీ అందుబాటులో ఉన్న తరువాత ఎంతో ప్రాచీనమైన ఈ కళలు అంతరించి పోతున్నాయి. ఎక్కడో ఒక చోట ఈ పురాతన సంస్కృతిని కాపాడుకోవాలని తపన పడేవారు లేకపోలేదు. ఈ క్రమంలోనే

 

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఈ కళలు బ్రతికించాలని, తమ ముందు తరాలవారు వీటి గురించి తెలుసుకోవాలని అమెరికాలో హరికధల కార్యక్రమం ఏర్పాటు చేపట్టింది. తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలని పాటించడంలో ఆదరించడంలో ముందుండే ప్రవాస సంఘాలో ముఖ్యమైన తానా ఇప్పుడు ఈ అపూర్వమైన కార్యక్రమానికి పూనుకుంది.

ఇందులో భాగంగానే నవంబర్ 2 వ తేదీన సీతారామ కళ్యాణం , హరికధ ఏర్పాటు చేసింది. ప్రముఖ కధకురాలు ఆదిలక్ష్మి భాగవతారిని ఆధ్వర్యంలో ఈ హరికధా గానం ఏర్పాటు చేయనున్నారు. నవంబర్ 2 అనగా శనివారం మధ్యాహ్నం 3 నుంచీ సాయత్రం 5 వరకూ ఈ వేడుకలు జరగనున్నాయని తెలుస్తోంది. ఈ వేడుకల గూర్చి  మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి (708) 2098725 నెంబర్ ని సంప్రదించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version