ఒకప్పుడు బాలీవుడ్ హీరో లకు సౌత్ హీరో లకంటే ఎక్కువ క్రేజ్ వుండేది. ప్రకటనల లో కూడా వాళ్లే ముందంజలో వుండే వారు. మన హీరోలంతా తెలుగు మార్కెట్ వరకే పరిమితం అయ్యే వారు. కాని ఇప్పుడు మొత్తం రివర్స్ అయ్యింది. ఇప్పుడు కంపెనీల వారు తెలుగు హీరోల వెంట బడుతున్నారు. దానికి మన హీరోల సినిమాల కలెక్షన్స్ సూపర్ గా ఉన్నాయి.
తెలుగు హీరోలలో ఈ ఏడాది బన్నీ ఇప్పటికే బోలెడన్ని కమర్శియల్ యాడ్స్ చేసాడు. పాన్ ఇండియా వైడ్ అవి రిలీజ్ అవుతున్నాయి.పుష్ప సినిమా తో తమకు భారత దేశం మొత్తం క్రేజ్ వచ్చింది. తన యాక్షన్, మ్యానరిజం అన్ని రాష్ట్రాల ప్రేక్షకులను అమితంగా అలరించాయి దానితో బాలీవుడ్ హీరోల్ని కాదని ఎక్కువ కంపెనీ లు యాడ్స్ బన్నీ కు ఇచ్చాయి.
ఇక తెలుగు హీరోలలో లోకల్ యాడ్స్ లో చాలా వరకు మహేశ్ బాబు కు వెళ్ళాయి మహేష్ తర్వాత స్థానం బన్నీ అందుకుంటున్నాడు. ఇక రామ్ చరణ్ ..ఎన్టీఆర్ కూడా కొన్ని యాడ్స్ చేస్తున్నారు అలాగే డార్లింగ్ ప్రభాస్ ఒకే చెప్పాలే గానీ ..అతనితో యాడ్స్ చేసేందుకు బడా కంపెనీలన్నీ క్యూలో ఉంటాయి. ఒకప్పుడు ఇదే దూకుడు హిందీ హీరోలు బ్రాండింగ్స్ లో చూపించే వారు. రెండేళ్లగా బాలీవుడ్ హీరోల వసూళ్లు సరిగా లేకపోవటం వల్ల తెలుగు హీరోలను యాడ్స్ కోసం అడుగుతున్నారు.