మ్యాట్రీమోనీ పేరుతో న్యూడ్ కాల్స్..ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ పోస్టు వైరల్

-

మ్యాట్రీమోనీ మోసాలతో తస్మాత్ జాగ్రత్త అని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఈ క్రమంలోనే యువతను హెచ్చరిస్తూ ‘ఎక్స్’వేదికగా ఆయన ఓ వీడియోను పోస్టు చేశారు.మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల ద్వారా ఈ మధ్య మోసాలు పెరిగిపోతున్నాయన్నారు.యువతీయువకుల ఫోటోలతో నకిలీ ప్రొఫైల్స్‌ను సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేస్తున్నారు.

ప్రేమ,పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి న్యూడ్ వీడియో కాల్స్ చేస్తారని, ఆ వీడియోలను సేవ్ చేసుకుని అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేకపోతే సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు గురిచేస్తున్నారని అలర్ట్ చేశారు. న్యూడ్ వీడియోల వ్యవహారం బయటకు వస్తే పరువు పోతుందనే భయంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారని తెలిపారు. అందుకే మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో పరిచయమైన వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా వీడియో కాల్స్, న్యూడ్ ఫోటోలు అడిగినా కచ్చితంగా అనుమానించాల్సిందేనని హెచ్చరించారు. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. కాగా, ఓ యువతి తన ఫ్రెండ్‌కు జరిగిన విషయాన్ని, మ్యాట్రిమోనీ మోసాలపై ఎక్స్ వేదికగా పోస్టుచేయగా.. ఆర్టీసీ ఎండీ దాన్ని రీ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version