ఢిల్లీలో నూతన ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రీ డెవలప్ మెంట్ ఆఫ్ ఏపీ భవన్ పేరుతో కొత్త డిజైన్లను కూటమి సర్కార్ పరిశీలించనుంది. మొత్తం 11.53 ఎకరాల్లో ఏపీ భవన్ నిర్మాణం చేయనున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.గతంలో నిర్మించిన భవనాలను రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి వాడుకుంటున్నాయి.
అయితే, ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల అధికారులు భవన్ విభజనను ఖరారు చేసుకుని ప్రతిపాదనలు పంపగా కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఇప్పుడున్న పాత భవనం తెలంగాణ అవసరాల రీత్యా వాడుకునే అవకాశం ఉన్నది. కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యాక ఏపీ అధికారులు అందులోకి షిఫ్ట్ అవుతారని సమాచారం.