కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈడీ వేధింపులకు నిరసనగా చలో రాజ్ భవన్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఖైరతాబాద్ సర్కిల్ వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను రాజ్ భవన్ కు వెళ్లనీయకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. దీంతో ఖైరతాబాద్ లో కాంగ్రెస్ నేతల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీశాయి.
రోడ్డుపై యువజన కాంగ్రెస్ నేతలు బైక్ కి నిప్పుపెట్టారు. బస్సులను అడ్డుకొని నిరసనకు దిగారు. ఆర్టిసి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. యూత్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ ఆర్టిసి బస్సు ఎక్కి నిరసన తెలిపారు. కాంగ్రెస్ నేతల ఆందోళనలతో ఖైరతాబాద్ లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. మరికాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాజ్ భవన్ చేరుకోనున్నారు గవర్నర్ తమిళిసై. దీంతో రాజ్ భవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది.