ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత

-

హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రూ,800 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించాలని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ముట్టడికి బయలుదేరారు కాంట్రాక్టర్లు. ఈ నేపథ్యంలో వారిని అడ్డుకున్నారు పోలీసులు. పోలీసులకు, కాంట్రాక్టర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. కాంట్రాక్టర్లకు మద్దతుగా బిజెపి కార్పొరేటర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు.

దీంతో భారీగా పోలీసులు మోహరించారు. కాంట్రాక్టర్ల అరెస్టు చేసి అక్కడనుండి తరలించారు పోలీసులు. ఇదిలా ఉంటే నేడు జరిగే జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశానికి నల్ల బ్యాడ్జీలతో వచ్చారు 43మంది బిజెపి కార్పొరేటర్లు ఎమ్మెల్యే రాజాసింగ్ ను విడుదల చేయాలని ప్లకార్డులు పట్టుకుని సమావేశానికి వచ్చారు బిజెపి కార్పొరేటర్లు. రాజాసింగ్ ను విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version