మూసీ సుందరీకరణలో భాగంగా రాష్ట్ర సర్కార్ మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఎఫ్‌టీఎల్,బఫర్ జోన్ల పరిధిలోని ఆక్రమణలను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే, నిర్వాసితులు ఆందోళనలు చేస్తున్న క్రమంలో వారికి డబుల్ బెడ్‌రూమ్స్ కేటాయిస్తామని రేవంత్ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది.అందులో భాగంగా కొందరిని ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్‌రూం సముదాయాల్లోకి తరలిస్తున్నారు.మరికొందరిని ఇతర ప్రాంతాల్లోని డబుల్ బెడ్‌రూం ఇళ్లల్లోకి పంపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చంచల్‌గూడ పరిధిలోని డబుల్ బెడ్‌రూం ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
తమ కోసం నిర్మించిన డబుల్ ఇళ్లను మూసీ నిర్వాసితులకు ఎలా ఇస్తారంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు.చంచల్‌గూడలో ఇళ్లు లేని నిరుపేదలు చాలా ఉన్నారని.. డబుల్ బెడ్‌రూమ్స్‌ను కేవలం స్థానికులకే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున స్థానికులు అక్కడకు చేరుకుని నిరసన తెలుపుతుండగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట నెలకొంది. ఈ ఘటనలో పులువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.