మెదక్ పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గోవులను తరలిస్తున్నారంటూ గోరక్షణ సమితి, హిందూ సంఘాలు నిరసన ర్యాలీ తీశాయి. ఈ సందర్భంగా ర్యాలీ పై రాళ్లు వేశారు ముస్లిం మైనార్టీ సభ్యులు. అంతేకాదు…. హిందూ యువకునిపై కత్తిపోటు చోటు చేసుకుంది.
అటు మైనార్టీల షాపుల ధ్వంసం చేశారు హిందూ యువత. దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. ఈ తరుణంలోనే…. మెదక్ పట్టణంలో దుకాణాలు, పెట్రోల్ బంక్ లు మూసేశారు వ్యాపారాలు. ఆందోళనను కంట్రోల్ చేయడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారు. మెదక్ లో ఎక్కడ చూసిన పోలీసులే ఉండటంతో.. భయందోళనలో ప్రజలు ఉన్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.