ఫిలింనగర్ గుట్టల పై ఉన్న పురాతన హనుమాన్ దేవాలయాన్ని యధాతధంగా కొనసాగించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. మంగళవారం బజరంగ్ దళ్ బిజెపి పార్టీల ఆధ్వర్యంలో లో జరుగుతున్న పనులను అడ్డుకునేందుకు వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. దీంతో రామానాయుడు స్టూడియో దగ్గర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్ ఆలయం వద్దకు చేరుకొని వారికి సంఘీభావం ప్రకటించారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామానాయుడు స్టూడియో వెనుక ఉన్న పురాతన ఆలయాన్ని ధ్వంసం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఓ ప్రైవేటు సంస్థకు ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన భూమిని అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు ఎమ్మెల్యే రాజాసిం. ఎంతో ప్రాశస్త్యం కలిగిన దేవాలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తే సర్వ నాశనమైపోతారంటూ హెచ్చరించారు. ఎలాంటి వివాదం లేకుండా ఆలయానికి ఒక ఎకరం వదిలివేసి మిగిలిన స్థలంలో నిర్మాణాలు జరుపుకోవాలని కోరారు. లేనిపక్షంలో హిందువుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఎమ్మెల్యే రాజాసిం.