పండగ పూట బాబుని టెన్షన్ పెట్టిన బీజేపీ నేత!

-

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబేమో బీజేపీకి ఎలా దగ్గరవ్వాలో ఆలోచిస్తుంటే.. రకరాకల ఎత్తులు పై ఎత్తులు వేస్తుంటే.. మోడీ మీద ఈగ వాలనివ్వను అన్న రేంజ్ లో ప్రెస్ నోట్ లు ఇస్తుంటే.. తమ అనుకూల మీడియాతో మెప్పించే ప్రయత్నం చేస్తుంటే.. మరో పక్క బీజేపీ నేతలేమో.. ఆ దూరాన్ని మరింతపెంచే పనికి పూనుకుంటున్నారు! తాజాగా పోలవరం పేరు చెప్పి పండగ పూట బాబుకు కొత్త టెన్షన్ తెప్పించారు బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్!

బాబు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం పూర్తిచేస్తామని, జగన్ ను రాసుకోమని హడావిడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో పోలవరం పూర్తికాకపోవడానికి నేరం కేంద్రంపై వేసేపనికి పూనుకున్నారు చంద్రబాబు! అసలు జాతీయ ప్రాజెక్టును తమరెందుకు తీసుకున్నారు అనే మాటను సైడ్ చేసిన నాటి టీడీపీ ప్రభుత్వం… పోలవరానికి నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందంటూ చెప్పుకొచ్చారు! అయితే ఈ విషయాలు తాము మరిచిపోలేదని అన్నట్లుగా… పోలవరంపై స్పందించారు మాధవ్!

పండగపూటైనా ఏదో కాస్త ప్రశాంతంగా ఉంటే… పోలవరంలో అవినీతి చాలా జరిగిందంటూ మైకందుకున్నారు మాధవ్! ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన… పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని.. ఇందులో ఎలాంటి అనుమానం లేదని.. పోలవరం అంచనాల పెంపుపై విచారణ జరగాలని.. ఇదే విషయమై గడ్కరీకి కూడా తాము ఫిర్యాదు చేశామని.. బాంబు పేల్చారు!

అంతే కాకుండా… వాస్తవ అంచనాలకు అనుగుణంగా కేంద్రం నిధులు ఇస్తుంది తప్ప.. సాంకేతికత పేరుతో పోలవరం అంచనాలను అమాంతం పెంచేస్తే ఇవ్వదని స్పష్టం చేశారు!! ఫలితంగా పండగ పూట బాబుని ఇబ్బంది పెట్టారు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version