పస లేదు: టీడీపీ నేతల విమర్శల్లో మరేముందంట…?

-

గీతం విద్యాసంస్థల ప్రహరీ తొలగింపు, అక్రమ నిర్మాణాల కూల్చివేత, మరికొన్ని శాశ్వత భవనాలకు మార్కింగ్‌ చేసిన విషయంపై స్పందిస్తున్న టీడీపీ నేతల వాదనలో, విమర్శల్లో పసలేదు సరికదా.. నస ఉంది.. మధ్య మధ్యలో “బూతు” కూడా ఉంది! అయితే… గీతం విద్యాసంస్థల అక్రమ నిర్మాణాలను కూల్చడం తప్పా.. రాత్రి సమయంలో కూల్చారనడం తప్పా.. ఆక్రమించుకోవడం తప్ప.. ఎవరో కబ్జా చేసేస్తారేమో అని ఆ భూమిని సక్రమంగా వాడదామని తీసుకున్నాము అని వాదించడం తప్పా?

గీతం విద్యాసంస్థలకు నోటీసులు ఇవ్వలేదు అనే విమర్శలో నిజం లేదని.. సుమారు ఐదు నెలల క్రితమే యాజమాన్యానికి నోటీసులు ఇచ్చామని చెబుతున్నారు అధికారులు. ఈ విషయంలో స్పందించిన టీడీపీ నేతలు గీతం యాజమాన్యాన్ని వెనకేసుకోస్తానికి చేస్తున్న విమర్శలు తేలిపోతున్నాయనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి! అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం!

చదువు చెప్పే విద్యాసంస్థను కూల్చేస్తారా? బుద్ధుందా ఆ గాడిద కొడుకులకు.. ఆర్డీవో దగ్గరుండి పడగొట్టాడు. ముందు ఆర్‌డీవో, ఆ నా….. సస్పెండ్‌ చేయాలి.. గీతం కాలేజీని ధ్వంసం చేయడమేంటి. అధికారులకు జ్ఞానం లేదా అంటూ అయ్యన్నపాత్రుడు ఆయాసంగా ఆవేసంగా మాట్లాడారు! అసలు ఇందులో లాజికల్ వాదన ఎక్కడుంది? చదువు చెప్పే విద్యాసంస్థ అయినా.. అనాదాశ్రమం అయినా… ప్రభుత్వ భూమిని ఆక్రమించి కడితే వదిలేయాలా? అర్ధం పర్థం లేని విమర్శలు కాకపోతే!

ఆ భూముల్ని అందరూ ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. తమకిస్తే అభివృద్ధి చేసుకుంటామంటూ అప్పటి ముఖ్యమంత్రిని దివంగత ఎంవీఎస్‌ మూర్తి కోరితే కేటాయించారని చెబుతున్నారు మరో నేత!! ప్రభుత్వ భూములను ఎవరో ఆక్రమించాలని చూస్తుంటే… ప్రభుత్వం చేతులు కట్టుకుని ఉంటాదా? ప్రభుత్వం చేతకానిదవ్వడం వల్ల.. ఆ భూములు తమకిస్తే ఫుల్ గా సద్వినియోగం చేసుకుంటామని అడిగే వాదనలో అర్ధం ఎంత?

ఇక ట్విట్టర్ లో స్పందించిన చినబాబు, చంద్రబాబులు కూడా ఇవి కక్ష సాధింపు చర్యలు అని చెబుతున్నారే తప్ప… ఆ భూములు గీతం సంస్థలవే అని మాత్రం చెప్పలేకపోతున్నారు. ఆ భూములు ప్రభుత్వానివి కాదని అనలేకపోతున్నారు. జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారే తప్ప.. అవి సక్రమైన కట్టడాలని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఫలితంగా వారి వాదనల్లో పసలేదు సరికదా నస మాత్రమే ఉంది.. ఆ నసకు బూతుల రూపంలో అయ్యన్న కాస్త సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేస్తున్నారంతే… అనే కామెంట్లు పడుతున్నాయి!

Read more RELATED
Recommended to you

Exit mobile version