జమ్మూ కాశ్మీర్ లో భీకర ఎన్కౌంటర్… జవాన్ మృతి, ఇద్దరు ఉగ్రవాదులను లేపేసిన ఆర్మీ…!

-

జమ్మూ కాశ్మీర్ లో ఆపరేషన్ ఆల్ అవుట్ విజయవంతంగా సాగుతుంది. ఉగ్రవాదుల లక్ష్యంగా ఆర్మీ కాల్పులు జరుపుతుంది. నేడు మరో ఎన్కౌంటర్ జరిగింది కాశ్మీర్ లోయలో. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భారత ఆర్మీ కాల్చి చంపింది. మరో జవాన్ ని భారత ఆర్మీ కోల్పోయింది. పుల్వామాలో జరిగిన ఈ కాల్పుల్లో… మరికొంత మంది జవాన్ లకు గాయాలు అయినట్టు తెలుస్తుంది.

కీలక ఉగ్రవాదులు ఉన్నారు అనే నిఘా వర్గాల సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టగా… ఆర్మీ తారసపడగా వారు కాల్పులు జరపడంతో ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయారు అని అధికారులు మీడియాకు వివరించారు. ఈ కాల్పులకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. గాలింపు చర్యలు, ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది అని ఆర్మీ మీడియాకు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version