పాకిస్తాన్ దేశంలోని కరాచీలో గల జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు చైనీయులు మృతి చెందారు. ఈ మేరకు పాకిస్తాన్‌లోని చైనా ఎంబసీ అధికారిక ప్రకటన చేసింది. మరోవైపు తొలుత దీనిని ఆత్మాహుతి దాడిగా భావించినా.. వాహనంలో పేలుడు పదార్థాలు పెట్టి పేల్చినట్లు ఆ తర్వాత అధికారులు ధృవీకరించారు.
వివిధ దేశాల నుంచి వచ్చే ఫారినర్సే లక్ష్యంగా ఈ ఉగ్రదాడి జరిగినట్లు తెలుస్తోంది.అయితే, ఈ దాడి జరిపింది తామే అని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఈ లిబరేషన్ ఆర్మీ స్వతంత్ర పాకిస్తాన్‌లోని స్వతంత్ర బలూచిస్తాన్ కోసం గత కొంతకాలంగా పోరాటాలు చేస్తోంది.దీంతో పాకిస్తాన్ ఆర్మీ లిబరేషన్ గ్రూపులను అంతమొందించాలని వారి మీద దాడులు కొనసాగుతోంది.ఈ క్రమంలోనే రెచ్చిపోయిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ఉగ్రదాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.