ఈ కేంద్ర పథకం మహిళలకు వరం.. రూ.2,00,000 పొందొచ్చు ఇలా..!

-

మహిళలకు కాల పరిమితతో కూడిన రుణాలను ఇవ్వడానికి కేంద్రం స్వర్ణిమ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ స్కీం ద్వారా పేద మహిళలకు వ్యాపారాలు చేయడానికి రెండు లక్షల వరకు లోన్ వస్తుంది. ఈ రుణం పై వడ్డీ సంవత్సరానికి 5% మాత్రమే. ఈ డబ్బులు ద్వారా బీసీ మహిళల సామాజిక ఆర్థికంగా నిలతొక్కుకోవడానికి అవుతుంది. దీన్ని జాతీయ బీసీల ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిచయం చేసింది. స్టేట్ చానలైజింగ్ ఏజెన్సీలు నోడల్ ఏజెన్సీ గా ఉంటాయి. తన కాళ్లపై మహిళలు నిలబడాలని స్వయంగా ఉపాధి పొందడానికి రెండు లక్షల వరకు రుణాన్ని ఇస్తున్నాయి. అంతకంటే ఎక్కువ కావాలంటే మాత్రం సొంతంగా పెట్టుబడి పెట్టాలి.

ప్రాజెక్టు రెండు లక్షల లోపు అయితే మాత్రమే లోన్ వస్తుంది. స్వర్ణిమ పథకానికి కావలసిన అర్హతల గురించి చూద్దాం. తప్పనిసరిగా స్త్రీ అయి ఉండాలి. అలాగే 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. తప్పనిసరిగా పారిశ్రామికవేత్త అయ్యి ఉండాలి. మొత్తం వార్షిక కుటుంబాదాయం ఏడాదికి మూడు లక్షల కంటే తక్కువ ఉండాలి. ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు ఉండాలి.

రేషన్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, కులతృవీకరణ పత్రంతో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉండాలి. అర్హులైన మహిళ దగ్గర్లోని ఎస్సీఏ ఆఫీస్ కి వెళ్ళాలి ఆ ఆఫీస్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రభుత్వ అధికారిగా వెబ్సైట్లో చూడొచ్చు. ఈ ఆఫీస్ కి వెళ్తే వారిని మా స్కీం దరఖాస్తు పత్రాన్ని ఇస్తారు. అడిగిన వివరాలను చెప్పి రుణం ఎందుకు కావాలి ఎలాంటి సమయానికి కావాలనేది చెప్పాలి ఇలా ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత లోన్ ఇస్తారు. దీంతో మహిళలు బిజినెస్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version