AI తో అన్ని ఉద్యోగాలు పోతాయి: ఎలాన్ మస్క్

-

ప్రపంచ మెల్ల మెల్లగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ముందు ముందు రోజుల్లో మనుషులతో సంబంధం లేకుండా పనులు జరిగిపోయే సమయం రావడానికి గట్టి పునాదులు పడ్డాయి. ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ గురించే ఇప్పటికే చాలా మంది మేధావులు భవిష్యత్తు చాలా భయంకరంగా ఉండనుందంటూ చెప్పారు. ఇక తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి భయంకరమైన వాస్తవాన్ని తెలియచేశారు. ఈయన మాట్లాడుతూ, భవిష్యత్తులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తుందని చెప్పారు. అపర మేధావి అయిన ఒక వ్యక్తి కంటే ఆర్టిఫీషియల్ చాలా తెలివైందని మాస్క్ తెలిపారు. AI ను ఒక పవర్ ఫుల్ టెక్నాలజీ గా మనము చెప్పుకోవచ్చును, మాములుగా మనుషులు సంతృప్తి కోసం మాత్రమే ఉద్యోగాలు చేస్తుంటారు, కానీ ఈ AI మాత్రం చాలా ఖచ్చితత్వంగా పనులు చేయగల టెక్నాలజీ అంటూ మస్క్ చెప్పడం జరిగింది.

రానున్న కాలంలో మనము ఏమి చేసి బ్రతకాలో అని ఆలోచించేలా చేస్తుంది అంటూ AI గురించి భయంకరమైన నిజాలను మస్క్ తెలియచేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news