ఐపీఎల్ సీజన్ 2024 కోసం అప్పుడే ప్లాన్ లు మొదలయ్యాయి, ఇండియాలో ప్రతి సంవత్సరం జరిగే మినీ క్రికెట్ ఫెస్టివల్ ఐపీఎల్ కోసం వేలం నిర్వహించనున్నారు. బీసీసీఐ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఐపీఎల్ సీజన్ 2024 కోసం డిసెంబర్ 19న వేలం ప్రక్రియ జరగనుంది. కాగా ఈ వేలాన్ని దుబాయ్ లో నిర్వహించడానికి సర్వం సిద్ధం అయింది. అందుకోసం ఇప్పటికే ఐపీఎల్ లో పాల్గొనే పది జట్ల దగ్గర ఉన్న ప్లేయర్స్ లో నవంబర్ 26వ తేదీ లోగా విడుదల చేసే మరియు తమ వద్ద ఉంచుకునే ఆటగాళ్ల వివరాలను కనుక తెలియచేస్తే.. ఆ తర్వాత వేలానికి వారిని లిస్ట్ లో యాడ్ చేస్తుంది బీసీసీఐ. ఇక ఈసారి వేలానికి గానూ ఒక్కో ఫ్రాంచైజీకి రూ. 100 కోట్ల రూపాయలను ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటికే వారి వారి దగ్గర ఉన్న పర్సు మనీ చూస్తే అత్యధికంగా పంజాబ్ కింగ్స్ దగ్గర రూ. 12 .20 కోట్లు ఉంది.
ఆ తర్వాత సన్ రైజర్స్ హైద్రాబాద్ వద్ద రూ. 6 .55 కోట్లు ఉన్నాయి. ఇక గత సీజన్లో లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ ను ఆఖరి బంతికి ఓడించి టైటిల్ ను అందుకుంది.