టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ కు షాక్… అందుకు మరోసారి నో చెప్పిన ఇండియా

-

ప్రపంచ కుబేరుడు టెస్లా, స్పెస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ కు మరోసారి షాక్ ఇచ్చింది ఇండియా ప్రభుత్వం. టెస్లా ఎలక్ట్రిక్ కార్లను ఇండియాలో ప్రవేశ పెట్టాని ఎలన్ మస్క్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కార్లను అమెరికాలోనే తయారు చేసి ఇండియాకు దిగుమతి చేయాలని ఎలన్ మస్క్

భావిస్తున్నాడు. అయితే దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలు తగ్గించుకోవాలని ఎలన్ మస్క్ డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి అంగీకరించడం లేదు. ఇతర కంపెనీలకు ఇవ్వని ప్రాధాన్యం టెస్లాకు మాత్రమే ఇవ్వడం సమంజసం కాదని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పాక్షికంగా తయారు చేసిన వాహనాలను ఇక్కడికి తీసుకువచ్చి అసెంబ్లింగ్ చేస్తే వాటిపై తక్కువ పన్నులే  విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మరోసారి తెలిపింది. మేకిన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా దేశీయంగా అసెంబ్లింగ్ తయారీ చేసే సంస్థలకు ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది.

Elon-Musk

అయితే గతంలో ఇండియాలో బిజినెస్ చేయాలంటే… అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నానని ఎలాన్ మస్క్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. అయితే దీనిపై ఇండియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ తో సహా.. పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, బెంగాల్ రాష్ట్రాల్లోని పలువురు మంత్రులు ఎలన్ మస్క్ ను ఇండియాలో తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version