జగన్, చంద్రబాబు ప్రభుత్వాలు ప్రజలను దగా చేశాయని విమర్శించారు టీజీ వెంకటేష్. రాయలసీమకు ఏంచేశారో జగన్ వివరించాలని, రాయలసీమ డిక్లరేషన్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా పెట్టుబడులు పక్క రాష్ట్రానికి వెళుతున్నాయని టీజీ వెంకటేష్ అన్నారు. అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అనేది బీజేపీ విధానం అని టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు. అయితే, రాయలసీమకు హైకోర్టు తీసుకువచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. అంతేకాకుండా.. రేపు కర్నూల్ లో నిర్వహించే రాయలసీమ గర్జన వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. రాయలసీమ డిక్లరేషన్ పై బీజేపీ అండగా వుంటుందన్నారు.రాయలసీమ గర్జనకు రాని వాళ్ళు సీమ ద్రోహులుగా మిగిలిపోతారు అంటున్న మంత్రి బుగ్గన సినిమా డైలాగులు మానుకోవలన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని,రాష్ట్రభివృద్ధికి బీజేపీ చాలానే నిధులు ఇచ్చిందన్నారు.
అమరావతే రాజధాని అనేది బిజెపి విధానమన్నరు.గుజరాత్ ఎన్నికలు ముగిశాక బీజేపీ ఫోకస్ ఆంద్రపైనే అన్నారు.రాయలసీమకు హైకోర్టు తీసుకువచ్చిందుకు నా వంతు కృషి చేస్తనని,అసలు రాయలసీమ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు టీజీ. రాయలసీమలో ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందని, గతంలో ఇదే తప్పు చంద్రబాబు చేశారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల వల్ల ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు భయపడి హైదారాబాద్ లో పెడుతున్నారని అన్నారు. ఎవరో ప్రభుత్వానికి తప్పుడు సలహాలు ఇస్తున్నారని, పరిపాలన అల్లకల్లోలంగా మారితే బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు.