తాడిపత్రి నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికలు ఉత్కంఠ బరితంగా మారాయి. ఎంపిటిసి అభ్యర్థులు గా నామినేషన్ వేసిన వారు మృతి చెందడంతో అధికారులు వెల్లడించారు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులుగా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి వర్గాలు ఉన్నాయి. జేసి సోదరుల సొంత గ్రామం జుటూరు కావడంతో రెండు పార్టీలు ఎన్నికలను ప్రస్టేజ్ గా తీసుకున్నాయి. దాంతో రెండుపార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.
తాడిపత్రి నియోజకవర్గంలో పెద్దపప్పూరు మండలం జుటూరు,పెద్దవడుగురు గుత్తి అనంతపురం ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ పోలింగ్ జరుగుతోంది. జుటూరు ఎంపిటిసి స్థానానికి అనిల్ కుమార్ రెడ్డి(వైయస్సార్ సిపి) గజ్జెగారి నాగిరెడ్డి(టిడిపి) పోటీలోఉన్నారు. జుటూరు ఎంపీటీసీ స్థానం లో 5 గ్రామాలు ఉన్నాయి. జూటూరు, తిమ్మన చెరువు, చిన్న పప్పూరు, ధర్మాపురం, చింతలపల్లిలో మొత్తం 2957 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1519, మహిళలు 1438 ఉన్నారు. పెద్ద వడుగూరు మండలం గుత్తి అనంతపురం ఎంపిటిసి ఎన్నికల్లో బరిలో చిలకల చిన్న గోవిందు(టిడిపి) వెంకట స్వామి రెడ్డి(వైయస్సార్ సిపి) ఉన్నారు. మొత్తం 2342 ఓట్లు ఉండగా పురుషులు 1210, మహిళలు 1132 ఉన్నారు.