ఇండియాలో కొత్తగా 8,865 కరోనా కేసులు.. 287 రోజుల తర్వాత ఇదే తొలిసారి

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఇండియా లో కొత్తగా 8885 కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి. అలాగే గడచిన 24 గంటల్లో 197 మరణాలు నమోదుకాగా… 11,971 మంది కరోనా నుంచి కోలుకునీ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

అయితే.. గడచిన 24 గంటల్లో ఇంత తక్కువగా కరుణ కేసులు నమోదు కావడం 287 రోజుల తర్వాత ఇదే మొదటిసారి. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య… 1,30,971 గా నమోదు అయింది. ఇంత తక్కువ యాక్టివ్ కేసుల సంఖ్య నమోదు కావడం ఐదు వందల ఇరవై ఐదు రోజుల తర్వాత ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా అటు కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు ఏ మాత్రం తగ్గటం లేదు. గడచిన 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో ఏకంగా 4547 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే 17 మంది మృతి చెందగా… 6866 మంది ఈ కరోనా నుంచి కోరుతున్నారు.