BREAKING : హీరో అజిత్‌ ఇంటికి బాంబు బెదిరింపు..!

-

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ ఇంటికి బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్‌ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే చెన్నైలోని ఆయన నివాసం ఇజంబక్కంలో పోలీసులు బాంబు స్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. దాదాపు రెండు గంటలపాటు సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత బాంబు బెదిరింపు కాల్‌‌లో వాస్తవం లేదనే నిర్ణారణకు వచ్చారు. జులై 18న అజిత్‌ ఇంటిలో బాంబు పెట్టినట్లు అజ్ఞాత వ్యక్తి నుంచి కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్ వచ్చింది. ఆ వెంటనే పెట్టేసినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో ఫోన్‌ కాల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు. ఈ ఫోన్‌ కాల్‌ తమిళనాడులోని విల్లుపురం జిల్లా నుంచి వచ్చిందని, త్వరలో కచ్చితమైన లోకేషన్‌ను గుర్తించి అజ్ఞాతవ్యక్తిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇటీవల హీరో విజయ్‌, రజనీకాంత్‌ల‌ ఇంటికి కూడా బాంబు‌ బెదరింపు కాల్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తి గురించి ఆరా తీయగా మానసిక రుగ్మతతో బాధపడుతున్న పేషంట్ అని గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version