ప్రముఖ హీరో నితిన్, గత కొంతకాలంగా సరైన కమర్షియల్ విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. తన ఆశలను ‘తమ్ముడు’ చిత్రం మీద పెట్టుకుని, ఈ సినిమా తనకు మళ్లీ సక్సెస్ ట్రాక్‌ను తెస్తుందని నమ్మాడు. ఈ చిత్రం, గత రెండు సంవత్సరాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్నప్పటికీ, తాజాగా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 4న విడుదల కాబోతున్నది. ఈ విషయాన్ని చిత్రబృందం ఆదివారం ఓ వీడియో రూపంలో అధికారికంగా ప్రకటించింది. ఈ మధ్యకాలంలో, సినిమా ప్రమోషన్లలో, క్రియేటివ్ వీడియోలలో దర్శకులు సైతం చాల ఎనర్జీతో పాల్గొంటున్నారు. ఈ చిత్రం కోసం కూడా, విడుదల తేదీ వీడియోను క్రియేటివ్‌గా రూపొందించారు. ఈ వీడియోలో యాక్టర్స్ స్వసిక విజయన్, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, లయ, బేబి శ్రీరామ్ దీత్య ఒక్కొక్కరుగా డైరెక్టర్ శ్రీరామ్ వేణు దగ్గరకు రాగా, వారు “తమ్ముడు” సినిమా విడుదల తేదీ ఎప్పుడనే ప్రశ్నలు అడుగుతారు.
వర్ష బొల్లమ్మ, తన ప్రమోషన్లు తానే చేస్తానని, తన మీమ్స్ కూడా తానే తయారుచేస్తానని, రిలీజ్ డేట్ అడుగుతుంది. లయ మాత్రం “నా పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు, తేదీ చెప్పడం లేదు… అసలు సినిమాలో నేను నటించానా?” అని అడుగుతుంది. చివరలో, బేబి శ్రీరామ్ దీత్య కూడా “నేను థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు సినిమా ప్రారంభమైంది, ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా, సినిమా విడుదల ఎప్పుడనే?” అని ప్రశ్నిస్తుంది.
అయితే, డైరెక్టర్ శ్రీరామ్ వేణు వారి ప్రశ్నలకు సమాధానంగా, “మీకు సమాచారం ఇవ్వగలను” అంటూ, విడుదల తేదీని తన వద్ద వదిలేసినట్టు చెబుతాడు. చివరగా, ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ శ్రీరామ్ వేణు బర్త్ డే కేక్ కట్ చేసి, జూలై 4న ‘తమ్ముడు’ సినిమా విడుదలైతే అన్నట్లు ప్రకటిస్తారు.