పాకిస్థాన్ ముఖాల్లో ఆ చిరునవ్వును తుడిచేయాలి.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

-

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్ ఉల ముస్లిమీన్ (AIMIM) అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాకిస్థాన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆదివారం బీహార్ రాష్ట్రంలోని ఈస్ట్ చంపారన్‌లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ, ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై ఘాటుగా స్పందించారు. పాకిస్థాన్‌ను ఒక విఫల దేశంగా పేర్కొంటూ, భారత్‌పై దాడి చేసే ధైర్యం చేయకూడని పరిస్థితి పాక్‌కు రావాలని అన్నారు.

“భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్థాన్ వందసార్లు ఆలోచించాల్సిన దశ రావాలి. ఉగ్రదాడులపై పాక్‌ను ఎప్పటికైనా బుద్ధి వచ్చేలా చేయాలి,” అని ఓవైసీ పేర్కొన్నారు. ఉగ్రదాడుల సమయంలో ఆధారాలు ఇవ్వాలని అడిగే పాక్‌కి, గతంలో భారత వైమానిక దళాల స్థావరంపై దాడి జరిగినప్పుడు సమాధానం ఇవ్వలేదని గుర్తుచేశారు. పాక్‌ నుండి ఉగ్రవాదులు వచ్చి భారత innocent ప్రజలను చంపుతున్నారని, అలాంటి దేశానికి దీటైన చర్యలే సమాధానమవుతాయని స్పష్టం చేశారు.

అలాగే, తన భర్తను కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి ఇచ్చిన శాంతి సందేశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఆమె ధైర్యంగా మాట్లాడిన మాటలు హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీక. ఆలా కాకుండా విద్వేషాన్ని రెచ్చగొట్టే వారే పాకిస్థాన్‌కు నవ్వులు తెచ్చిపెడుతున్నారు,” అని ఓవైసీ చెప్పారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ప్రేమ, శాంతి మార్గాన్ని అనుసరించాలని ప్రభుత్వానికి సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news