ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సినిమా ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా ప్రారంభించిన సందర్భంలో ఈ ఏడాది జూన్ నెలాఖరున విడుదల అవుతుందని ప్రకటించడం జరిగింది.
అయితే అనూహ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 8వ తారీఖున విడుదలవుతున్నట్లు రాజమౌళి అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీంతో రాజమౌళి సినిమా అనటంతో రాబోయే ఏడాది సంక్రాంతి పండుగ ను టార్గెట్ చేసుకున్న మహేష్ మరియు పవన్ కళ్యాణ్ సినిమాలు వెనక్కి తగ్గాయి.
అయితే ఇటువంటి తరుణంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ వచ్చే సంక్రాంతికి అన్నా గాని నాగార్జున ఎట్టిపరిస్థితిలో బంగార్రాజు సినిమా రిలీజ్ చేయాలని ఫుల్ గా డిసైడ్ అయిపోయారు అంట. ‘సోగ్గాడే చిన్ని నాయన’ అనే సినిమాకి ప్రీక్వెల్ గా రాబోయే ‘బంగారు రాజు’ షూటింగ్ త్వరలోనే ప్రారంభించి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ‘సోగ్గాడే చిన్నినాయనా’తో సంక్రాంతికి భారీ విజయాన్ని అప్పట్లో అందుకోవడంతో ఇందుకోసమే నాగార్జున ధైర్యం చేస్తున్నట్లు సమాచారం.