ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్న వైసీపీ పార్టీ ఊహించని విధంగా పరాజయం చెందింది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ క్రమంలో పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. మాజీ సీఎం, వైసీపీ అధినేత ఓటమి అనంతరం పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడానికి కారాణం గురించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ విలేకర్లతో మాట్లాడారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు కూల్చివేయడం వల్లనే ఇంతటి దారుణ ఓటమిని చవిచూశామని గుడివాడ అమర్నాధ్ తెలిపారు. లేకపోతే ఈరోజు అధికారంలోకి వచ్చి ఉండేవాళ్లమని తెలిపారు. కూల్చివేతలే లేకపోతే తామందరం ఈరోజు అసెంబ్లీలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసేవారమని గుడివాడ అమర్నాధ్ అన్నారు. ఈ నేపథ్యంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విధంగా స్పందించారు. కూల్చివేతల వల్లనే ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో ఆయన ఇప్పటి ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని వ్యవహరిస్తే మంచిదని
సూచించారు.