మునుగోడు ఉపఎన్నిక చివరి ఘట్టానికి వచ్చింది…నవంబర్ 1తో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది..మరో రెండు రోజుల్లో అంటే 3వ తేదీన ఎన్నికల పోరు జరగనుంది. 6వ తేదీన ఫలితం వస్తుంది. అయితే ఇప్పటివరకు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య హోరాహోరీ ఫైట్ నడిచింది. ముఖ్యంగా టీఆర్ఎస్-బీజేపీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగింది. ఆఖరికి కొట్టుకునే వరకు కార్యకర్తలు వెళ్ళిపోయారు.
టీఆర్ఎస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి గాని..ఆ గెలుపు భారీగా ఉండదని అంటున్నారు. తక్కువ మెజారిటీతోనే గెలిచే ఛాన్స్ ఉందని సర్వేల్లో తేలుతుంది. ఇక సెకండ్ ప్లేస్ విషయంలో కన్ఫ్యూజన్ ఉందని సర్వేల్లో తేలింది. కొన్ని సర్వేల్లో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్‌లో ఉండగా, కొన్ని సర్వేల్లో బీజేపీకి సెకండ్ ప్లేస్ ఇచ్చారు.
అయితే అనుకున్న విధంగా కాంగ్రెస్ ఓట్లు…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పడవని సర్వేల్లో తేలింది. అందుకే కోమటిరెడ్డికి కాస్త రిస్క్ ఎక్కువ ఉంది. ఇక సెకండ్ ప్లేస్‌లో కాంగ్రెస్ అయిన, బీజేపీ అయిన రావోచ్చు..ఎవరు సెకండ్ ప్లేస్‌లో ఉన్నా సరే..కాంగ్రెస్-బీజేపీల మధ్య ఓ నాలుగైదు వేల ఓట్లే తేడా ఉంటుందట. మొదటి ప్లేస్ టీఆర్ఎస్‌కే అంటున్నారు. మరి చూడాలి ఎన్నికకు ఇంకా రెండు రోజులు సమయం ఉంది..ఈలోపు ఎన్ని ట్విస్ట్‌లు ఉంటాయో..మునుగోడు ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో.