ఏపీలో ఆ పార్టీదే విజయం.. సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ జోస్యం..!

-

ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఇటీవల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. దీంతో జూన్ 4న వెలువడే ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయి..? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు..? అన్న చర్చలు రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజల్లో మొదలయ్యాయి. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఫలితాలకు ముందే ఆయన జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని యోగేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. టీడీపీ 15 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తోందని చెప్పారు. ఇక, సెంట్రల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఎన్డీఏకి గతంలో కన్నా 80 సీట్లు తగ్గే అవకాశం ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఒడిషా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 20కి పైగా స్థానాల్లో బీజేపీ గెలిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీకి సొంతంగా మెజార్టీ రాదని కీలక వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్లో అధికారం దక్కించుకోవాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 272 కన్నా తక్కువగానే ఈసారి బీజేపీకి సీట్లు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. 2019లో వచ్చిన 303 స్థానాల్లో 65 సీట్లు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మరీ యోగేంద్ర యాదవ్ జోస్యం నిజమవుతుందో లేదో తెలియాలంటే జూన్ 4న ఫలితాలు వెలువడే వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version