ఆరోగ్యానికి ఆ బియ్యమే మంచివటా..

-

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కన్నా రుచికర ఆహార పదర్థాలౖపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. మనదేశంలో సంపూర్ణ ఆహారంగా భావించే తెల్లబియ్యం (పాలిష్‌ పట్టిన బియ్యం) అధికంగా నియోగిస్తున్నారు. తెల్ల బియ్యం రుచిగా ఉండటంతో గ్రామీణ, పట్టణాల్లో ఎక్కువశాతం వీటినే వినియోగిస్తున్నారు.ముడి య్యం(దంపుడు బియ్యం, పాలిష్‌ లేకుండా). వీటిపై వైద్యనిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. ముడి బియ్యంలో అధికంగా పోషకాలు ఉంటాయని సూచిస్తున్నారు.

మాములుగా 100 గ్రా. ముడి బియాన్ని ఆహారంగా తీసుకుంటే 1.8గ్రా. ఫైబర్‌ లభిస్తుంది. అయితే పాలిష్‌ చేయడం బియాన్ని తీసుకుంటే 0.4గ్రా.మాత్రమే ఫైబర్‌ లభిస్తుందంటున్నారు. ఎల్లప్పుడు పాలిష్‌ చేసిన బియ్యం తీసుకుంటే సరైన పోషకాలు అందకపోవడంతో పోషకాహార లోపాలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముడి∙బియ్యాన్ని తీసుకోవడం వల్ల యాంటీ న్యూట్రియెంట్స్‌తో పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. శరీర నిర్మాణానికి ఉపయోగపడే ఖనిజ లవణాలకు ఇబ్బందులు కలిగిస్తాయి.

మితంగా తీసుకుంటేనే..

అధికంగా ముడి బియ్యం తీసుకోవడంతో ఆర్సెనిక్‌ విషరసాయనం ముప్పు ఉంటుంది. ఎక్కువగా ఆర్సెనిక్‌ చేరడంతో క్యాన్సర్, టైప్‌ 2 డయాబెటిస్‌ పలు రకాల జబ్బులు వస్తాయి. అవసరాన్ని బట్టి తినడమే మేలని వైద్యులు చెబుతున్నారు. మితంగా ముడిబియ్యం తినడంతో హెచ్‌డీఎల్‌(మంచి కొలెస్ట్రాల్‌) పెరిగి శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. మితంగా తీసుకోవడంతో గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ముడి బియ్యమే తీసుకోవాని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version