వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని నేడు విద్యాసంస్థల రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ లో భాగంగా నేడు మధ్యాహ్నం విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.కార్యాలయం ముట్టడికి విద్యార్థుల యత్నం చేశారు. వారిని అడ్డుకున్న పోలీసులు విద్యార్థులని అరెస్టు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.తక్షణమే పెండింగ్ పాఠ్యపుస్తకాలు, యునిఫామ్స్ ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
పెండింగ్ స్కాలర్ షిప్స్&ఫీజు రీయంబర్స్ విడుదల చేయాలనీ అన్నారు.విద్యార్ధులందరికి ఉచిత బస్ పాస్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచి, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రైవేట్, కార్పోరేట్ ఫీజుల నియంత్రణకై ఫీజులు నియంత్రణ చేయలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో ఖాళీగా ఉన్న అన్ని అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి వామపక్ష విద్యార్థి సంఘాలు.