సీఐ నాగేశ్వరరావు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్న వనస్థలిపురం పోలీసులు

-

మహిళపై అత్యాచారం కేసులో అరెస్ అయి చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్న మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావు ఎట్టకేలకు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే. తన వాచ్మెన్ భార్యపై అత్యాచారం చేశానని, ఈ విషయం బయట పెడితే చంపేస్తానంటూ తుపాకీతో బెదిరించానని, లైంగిక దాడి ఆనవాళ్లు మాయం చేసేందుకు తన దుస్తులు తానే స్వయంగా ఉతుక్కున్నానని నాగేశ్వరరావు అంగీకరించినట్లు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో వనస్థలిపురం పోలీసులు పేర్కొన్నారు.

అయితే విచారణలో భాగంగా నేడు సీఐ నాగేశ్వరరావు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు వనస్థలిపురం పోలీసులు.ఏడవ తేది రాత్రి నుండి ఎనిమిదవ తేది తెల్లలారుజాము వరకు ఏం జరిగింది,తుపాకితో బెదిరించాడని పోలీసులకు బాధితులు ఇచ్చిన స్టేట్ మెంట్ తో మొత్తం సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు పోలీసులు.హస్తినాపురంలోని ఎఫ్‌సిఐ కాలనీలో ఉన్న బాధితురాలు ఇంటి వద్ద ఏం జరిగింది, ఆరోజు రాత్రి జరిగిన పెనుగులాటకి సంబంధించిన అంశంతో పాటు ఇక్కడి నుండి ఇబ్రహీంపట్నం వరకు వెళ్లిన మొత్తం సన్నివేశాన్ని సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు.మూడోరోజు కస్టడీలో భాగంగా సీన్ రీకాన్స్ట్రక్షన్ చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version