ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో శనివారం ఒక బెలూన్ ప్రజలను కంగారు పెట్టింది. ఆకాశంలో ఎగురుతున్న ఒక వింత వస్తువును గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అది ఐరన్ మ్యాన్ ఆకారంలో ఉంది అని పోలీసులు తెలిపారు. ఈ వస్తువు ఉదయం డాంకౌర్ ప్రాంతంలో ఆకాశంలో కనిపించింది. ఆ తరువాత భట్టా పార్సాల్ గ్రామానికి సమీపంలో ఉన్న ఒక కాలువలో దిగింది.
అక్కడ కొంతమంది “గ్రహాంతరవాసి” అని భావించి చూడటానికి జనం గుమిగూడారు. ప్రజలలో ఆందోళన వెనుక ఒక ప్రధాన కారణం బెలూన్ యొక్క అసాధారణ ఆకారం అని అధికారులు వివరించారు. “ఇది ఐరన్ మాన్ (సూపర్ హీరో పాత్ర) ఆకారంలో ఉందని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. అయితే దాన్ని ఎవరు గాల్లోకి వదిలారు ఏంటీ అనేది తెలియలేదు. వస్తువులో హానికరమైనది ఏమీ లేదు అని పోలీసులు స్పష్టం చేసారు.