హాయత్ నగర్ కార్పోరేటర్ సామ తిరుమల రెడ్డి ని స్థానికులు కొట్టడం సంచలనం అయింది. హయత్ నగర్ రంగనాయకుల గుట్టలలో నాల భూమిలన్ని కబ్జాలకు గురి అవుతున్నట్టుగా గతంలో స్థానికులు తిరుమల రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళారు. అయినా సరే అతను మాత్రం పట్టించుకోలేదు. ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదు కాబట్టే ఈ దుస్థితి వచ్చింది అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
వర్షానికి ఇళ్లన్ని కూడా వర్షపు నీటితో మునిగి పోతున్నాయని హయత్ నగర్ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డిని పట్టుకుని నిలదీసి దాడి చేసారు. చర్చి దగ్గర ఉన్న నాల కబ్జా కు గురైందని కాలని వాసులు ఎప్పటి నుంచి చెప్తున్నారు…? ఓట్ల కోసం అయితేనే వస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.