ఆంధ్రప్రదేశ్ లో ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న జిల్లాలు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు. ఇక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకున్నాయి. కేంద్రం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేస్తూ వస్తుంది. ఇక్కడ అనుమాతిలకు సంబంధించిన పరీక్షలను కూడా చాలా పక్కగా చేస్తున్నారు. కరోనా పరిక్షలు వేగంగా చేసినా సరే ఇంకా కేసులు నమోదు బయటకు రాలేదు.
ఇక తాజాగా మూడు కేసులు శ్రీకాకుళం జిల్లాలో బయటకు రావడం తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అలజడి మొదలయింది. మూడు కేసులు అంటే ఒక్క రోజులో సామాన్యమైన విషయం కాదు ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న మన్యంలో ఒక్కసారిగా అలజడి ఈ స్థాయిలో రావడంతో కంగారు పడ్డాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ గిరిజన ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
అరకులో ఏ విధంగా అయితే మెజారిటి గిరిజనులు ఉంటారో శ్రీకాకుళం, విజయనగరంలో మొత్తం దాదాపుగా గిరిజనులే ఉంటారు. వాళ్లకు బయటి ప్రపంచంతో సంబంధాలు చాలా తక్కువగా ఉంటాయి. వాళ్లకు ఉన్న వనరులతోనే వాళ్ళు బ్రతకడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు గాని బయటి ప్రపంచం తో ఎక్కువగా లింకులు పెట్టుకునే అవకాశాలు ఉండవు.
ఒక్కసారి గనుక కరోనా వైరస్ గిరిజన ప్రాంతాల్లోకి వెళితే మాత్రం చేసేది ఏమీ ఉండదు. ప్రభుత్వం ఇప్పుడే అప్రమత్తం కావాలి. కనీసం కరోనా వస్తే ఏ లక్షణం ఉంటుందో వాళ్లకు తెలియదు. అవగాహన కల్పించినా అర్ధం చేసుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు. ఓడిస్సా సరిహద్దు గ్రామాల్లో ప్రజలు బయట ప్రపంచంలోకి రావడానికి ఆసక్తి చూపించరు. అందుకే ఏపీ సర్కార్ ఇప్పుడు ఆ గ్రామాల్లో అప్రమత్తమై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.