ప్రచ్చన్న యుద్ధం తర్వాత అమెరికా, రష్యాలు మధ్య బంధం ఏనాడు బలంగా లేదు. అలాంటిది రష్యా బలహీనపడిన తర్వాత అమెరికా వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. కానీ అది ఏనాడు ఇద్దరి మధ్య మనసులు కలిపేది లాగా లేదు. దీనికి కారణం అమెరికా పెట్టుబడీ దారి విధానం. ఇక చరిత్ర నుంచి బయటకు వస్తే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పొగడ్తలతో ముంచేశాడు రష్యన్ ప్రీమియర్ వ్లాదిమీర్ పుతిన్. ట్రంప్ ఓ అసాధారణ వ్యక్తి అని పొగిడేశారు పుతిన్. అమెరికా కొత్త అధ్యక్షుడు జోయ్ బైడెన్ ఇందుకు భిన్నమైన వ్యక్తి అని అన్నారు. బైడెన్ నాయకత్వంలోని అమెరికాతో తమ సంబంధాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆశాజనకంగా లేవన్నారు.
వచ్చే వారంలో జెనీవాలో అమెరికా, రష్యా నేతలు భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు గతం కంటే మెరుగుపరుచుకునేందుకు రష్యా సిద్ధంగా ఉన్నా అందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ వైఖరే కారణమన్నారు. అమెరికా విదేశాంగ విధానం బైడెన్ కాలంలో ఆశాజనకంగా లేదన్నారు. రష్యాను బెదిరించేందుకు ఐరపా ఖండంలో పలు దేశాలను అమెరికా తనవైపుకు తిప్పుకుని రష్యావైపు దాడులకు సిద్ధమయింది అమెరికా. ఇది పసిగట్టిన రష్యా పశ్చిమ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసి… అక్కడి పొరుగు దేశాల వ్యవహారాలపై కన్నేసింది. దీంతో క్షిపణులను మోహరించి అమెరికా ఆటకు బ్రేక్ వేసింది. ఇది ఈనాటిది కాదు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి ప్రపంచ దేశాలపై తమ పట్టును నిలబెట్టుకునేందుకు ఇరు దేశాలు ఎన్నో ఎత్తుకు పైఎత్తులు వేశాయి.