బిజినెస్ ఐడియా: ఇలా డిటర్జెంట్స్ బిజినెస్ చేస్తే అదిరిపోయే లాభాలు పొందొచ్చు..!

-

మీరు ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా..? అయితే మీ కోసం ఒక మంచి బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే మంచి రాబడి మీరు పొందవచ్చు. ఇప్పుడు ఉన్న మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ కూడా ఉంది. మరి ఎటువంటి ఆలస్యం చేయకుండా ఈ బిజినెస్ ఐడియా గురించి చూసేయండి.

బిజినెస్ ఐడియా/ business

ప్రతి రోజు ఇళ్ళల్లో ఉపయోగించే ప్రోడక్ట్ డిటర్జెంట్ (detergents). బట్టలు ఉతకడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు మన ఇది చాలా అవసరం. కాబట్టి ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. అయితే మీరు చేయాల్సిందల్లా ఏ బడ్జెట్లో స్టార్ట్ చేయాలి అనుకునేది మాత్రమే ఆలోచించుకోవాలి.

అదే విధంగా ఏఏ ముడి పదార్థాలను ఎలా కలపాలో తెలుసుకోవాలి. ప్రభుత్వం దీని కోసం ట్రైనింగ్ కూడా ఇస్తుంది లేదా మీరు యూట్యూబ్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. అన్ని యంత్రాలు చేసేస్తాయి కాబట్టి మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు కూడా.

రకరకాల పౌడర్స్ ని తీసుకుని ఏవి ఎంత కలపాలో తెలుసుకుని వాటిని కలిపి యంత్రంలో వేస్తే అదే ప్యాకింగ్ చేసేస్తుంది. ఆటోమేటిక్ గా ప్యాకింగ్ కూడా అయిపోతాయి. కాబట్టి మీకు పెద్దగా శ్రమ కూడా ఉండదు. దీనికోసం మీరు అవసరమయ్యే మెటీరియల్స్, ప్యాకేజింగ్ కవర్లు, మిషన్లు, ఇన్సూరెన్స్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటి ముందుగా సిద్ధం చేసుకోవాలి.

మీరు మీసేవ కేంద్రానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. కంపెనీ పేరు చెప్తే పాన్ కార్డు ఇస్తారు. నలుగురు కంటే ఎక్కువ సిబ్బందితో వ్యాపారం చేయాలనుకుంటే లేబర్ సర్టిఫికెట్ పొందాలి గుర్తుంచుకోండి.

కేంద్ర ప్రభుత్వం ముద్ర స్కీమ్ ద్వారా 50 వేల రూపాయల నుంచి 10 లక్షల వరకు లోన్ కూడా ఇస్తుంది. కాబట్టి ఎటువంటి చింత అవసరం లేదు. మీకు దగ్గరలో ఉన్న షాప్స్ లోకి వెళ్లి మీరు వీటిని సప్లై చేయవచ్చు. లేదా మీరు వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి యాడ్స్ ఇవ్వచ్చు. ఆన్లైన్లో కూడా మీరు అమ్మొచ్చు. అయితే ఈ చిన్న వ్యాపారం కోసం మీకు కనీసం ఐదు లక్షల నుంచి 10 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది ఆ తర్వాత మీకు లాభాలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news