ఆంధ్ర ప్రదేశ స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్ ఉత్కంఠ గా సాగుతుంది. ముఖ్యంగా కృష్ణ జిల్లా కొండ పల్లి మున్సిపాలిటీ రిజల్ట్ నరాలు తెగేలా ఉత్కంఠ ను రేపుతుంది. ఈ మున్సిపాలిటీ లో 29 వార్డు లకు అధికార పార్టీ అయిన వైసీపీ 14 గెలుచు కుంది. అలాగే టీడీపీ కూడా 14 గెలుచు కుంది. దీంతో హంగ్ ఎర్పడింది. అయితే ఈ మున్సిపాలిటీ లో ఇండిపెండెంట్ కూడా ఒక వార్డు లో గెలుచుకున్నారు. అయితే ఈ ఇండిపెండెంట్ వార్డు మెంబర్ అయిన శ్రీలక్మీ టీడీపీ లో చేరింది. దీంతో టీడీపీ బలం 15 కు చేరింది. దీంతో అక్కడ ఎక్స్ అఫీసియో ఓట్లు కీలకంగా మారాయి.
ఈ ఎక్స్ అఫీసియో ఓట్ల ద్వారానే అక్కడ ఎవరు గెలిచేది తెలుతుంది. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఓటు అధికార పార్టీ కి ఉంటుంది. దీంతో వైసీపీ బలం కూడా 15 కు చేరింది. అయితే అక్కడి ఎంపీ అయిన కేశినేని నాని టీడీపీ కి చెందన వాడు. అయితే దీంతో కేశినేని నాని ఓటు చాలా కీలకం కానుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. కొండపల్లి మున్సిపల్ అధికారులు నాని ని ఎక్స్ అఫిసియో ఓటు నమోదు చేసుకోమ్మని తెలిపినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని ఎంపీ కేశినేని నాని పెద్దగా పట్టించు కోలేదని సమాచారం. దీంతో ఎంపీ కి ఇప్పుడు ఓటు ఉంటుందా లేదా అని తెలియాల్సి ఉంది.