ముందస్తు ఎన్నికలకు పోదాం.. ఓడితే టీడీపీ మూసేస్తాం : అచ్చెన్నా సవాల్‌

-

ప్రజలు వైసీపీతోనే ఉంటే, ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్న అచ్చెన్నాయుడు… నిజంగా సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే, తమ పార్టీని మూసేయడానికి కూడా తాము సిద్ధమేనని సవాల్‌ విసిరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కుప్పంలో మకాం వేస్తే, ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా బొకేలిచ్చి శుభాకాంక్షలు చెబుతున్నాడని… బేతంచర్లలో టీడీపీ నాయకుడే లేకపోయినా.. 6 స్థానాలు గెలిచామన్నారు.

రాష్ట్ర ఆర్థిక మంత్రి సొంత వార్డులో వైసీపీ ఓడిపోయిందని…. దానిపై ముఖ్యమంత్రి ఏం మాట్లాడరేంటి? అంటూ ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై చర్చించడానికి కూడా ఈ ముఖ్యమంత్రికి ధైర్యం లేదని… ఒక్కరోజు అసెంబ్లీ పెట్టడం ఏమిటి? అని నిలదీశారు. వైసీపీ నేతలు, మంత్రులు నిర్వాకంతో మహిళలు ముఖాలకు చీరచెంగులు అడ్డంపెట్టుకొని సిగ్గుతో తలదించుకున్నారని… కుప్పంలో వైసీపీ గెలుపుని ప్రజలు అసలు లెక్కేసుకోవడం లేదని తెలిపారు. కుప్పంలో ఎవరి పని అయిపోయిందో, కొద్దిరోజుల్లోనే మంత్రులందరికీ తెలిసొస్తుందని హెచ్చరించారు.కుప్పం మున్సిపాలిటీ గెలిచామని ముఖ్యమంత్రి, మంత్రులు జబ్బలు చరుచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news