ఏపీలోని అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చిన్నారిని కన్నతండ్రి కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకివెళితే..
అనంతపురంలో నివాసం ఉండే శివ అనే వ్యక్తి బాయ్స్ హాస్టల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్నాడు.అయితే,తన బిడ్డ ఎక్కడపడితే అక్కడ మూత్రవిసర్జన చేసిందంటూ కన్నకూతురిపై కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని JNTU కళాశాల సమీపంలో జరగగా.. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. మూడేళ్ల చిన్నారిపై కిరాతకంగా దాడికి పాల్పడిన శివపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.