ఏపీలోని గీత కార్మికులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. కల్లు గీత కార్మికులు మరణిస్తే… వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని జగన్ సర్కార్ రెండింతలు చేసింది. ఈ మేరకు రానున్న 5 ఏళ్లకు కల్లు గీత నూతన విధానాన్ని ఏపీ సర్కార్ సోమవారం రోజున రిలీజ్ చేసింది.
ప్రస్తుతం కల్లు గీత కార్మికులు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. నూతన కల్లు గీత విధానం ద్వారా ఈ పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నరేగా, ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా కల్లు గీత కార్మికులను ఆదుకుంటామని తన నూతన విధానంలో ప్రభుత్వం క్లియర్ కట్ గా చెప్పింది. కల్లు గీత కార్మికులకు వైఎస్‌ఆర్ బీమాను వర్తింప జేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.