కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అంజయ్య ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లిలో ఆదివాసులను బలి తీసుకున్నారని, కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆరోపించారు . ఇంద్రవెల్లిలో జరిగిన పోలీస్ కాల్పుల ఘటనను యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఖండించింది అని ఆయన గుర్తు చేశారు . కాల్పుల ఘటనలో దాదాపు 250 పైగా ఆదివాసులు చనిపోయారు అని తెలిపారు.
మంగళవారం నిర్మల్‌లోని బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఇంద్రవెల్లిలో సభ నిర్వహించి అమరులకు నివాళులు అర్పించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు ఆదివాసులను పట్టించుకున్న పాపాన పోలేదు అని ,కేవలం గిరిజనుల ఓట్ల కోసమే సభ పెట్టాడని అన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గూడెములు, గిరిజన అభివృద్ధి కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి చెందాయని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అనేక పథకాలను అమలు చేసి, గూడేములను, తండాలను పంచాయతీలుగా మార్చి ‘మా ఊళ్లో-మా రాజ్యం’ నినాదాన్ని సాకారం చేశామన్నారు.