ఫుట్ బాల్ ప్లేయర్ ను దోబీ గా మార్చేసిన కరోనా మహమ్మారి..!

-

ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా.. క్రీడారంగంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తాజాగా బిహార్​కు చెందిన నేషనల్​ ఉమెన్స్​ ఫుట్​బాల్​ ప్లేయర్ మోనీ కుమారి​ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఫలితంగా జీవనోపాధి కోసం బట్టలు ఉతుకుతోంది. బిహార్​కు చెందిన జాతీయ మహిళా ఫుట్​బాల్​ క్రీడాకారిణి మోనీ కుమారికి.. కరోనా కారణంగా కష్టాలు మొదలయ్యాయి. ఈ మహమ్మారి వల్ల తన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఫలితంగా తండ్రితో కలిసి నార్కటియాగంజ్​ రైల్వేస్టేషన్​ సమీపంలో ఓ చెరువు ఒడ్డున బట్టలు ఉతుకుతూ జీవనం సాగిస్తోంది. ఆల్ ఇండియా ఉమెన్స్ ఫుట్​బాల్​కు రెండు సార్లు మోనీ ప్రాతినిధ్యం వహించింది.

dhobi

ఇంతటి కష్టకాలంలోనూ ఆటను వదలనంటోంది కుమారి. రోజూ ప్రాక్టీస్​ కోసం సమయం కేటాయించడం మర్చిపోలేదని తెలిపింది.ప్రభుత్వం స్పందించి తన కుమార్తెకు ఉద్యోగం ఇప్పించాలని మోనీ తండ్రి కోరాడు. తద్వారా ఈ వృత్తిని మానేసి.. ఆటపై మరింత దృష్టిపెట్టేందుకు ఆస్కారం ఉంటుందని వెల్లడించాడు. కొవిడ్​ విజృంభణ సమయంలో పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుందని మోనీ సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version