విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా.. ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బైక్ పై వెళ్తున్న వ్యక్తులపై విద్యుత్ తీగ పడి ఒకరు మృతి చెందారు. ఇద్దరికి గాయాలు అయ్యాయి.

మేడ్చల్ జిల్లా కీసర నాగారం మున్సిపాలిటీ పరిధిలో దంపతులు సురేష్, మౌనిక, మూడేళ్ల బాబు శ్రేయాస్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈదురు గాలులకు విద్యుత్ తీగ తెగిపడ్డాయి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మౌనిక మృతి చెందారు. సురేష్, బాబు శ్రేయాస్‌ల పరిస్థితి విషమం మారింది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.