ఉగ్రవాదం అణచివేసిన ఘనత మోడీదే : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యతిరేక శక్తులన్ని బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు, కుట్రలు చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ జిల్లా కార్యకర్తల విసృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మూడోసారి అధికారంలోకి వచ్చి ప్రధాని మోడీ చరిత్ర సృష్టించారని అన్నారు.

చరిత్రలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌ని కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు అవమానించిందని, ఆయణ్ని ఎన్నికల్లో ఓడించాలని కుట్రలు చేసినట్లు చెప్పారు.అధికారం, ఎన్నికలతో సంబంధం లేకుండా సంస్థాగతంగా ముందుకెళ్లే పార్టీ బీజేపీ మాత్రమే అని ,దేశంలో సిద్ధాంతపరంగా, కార్యకర్తల ఆధారంగా, ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునే పార్టీ బీజేపీనే అని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదం, కుటుంబ పాలన, అవినీతి బాగా పెరిగిపోయినట్లు దేశ ప్రజలు గ్రహించారని ,అందుకే మూడుసార్లు ఎన్డీయేకి పట్టం కట్టారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి . దేశంలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా అణచివేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌లో బాంబుపేలుళ్లతో ప్రజలు వణికిపోయారు. బొగ్గు కుంభకోణం, కామన్ వెల్త్ కుంభకోణం, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం వంటి అనేక కుంభకోణాలతో సుమారు రూ.12లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version