The Family Man Actor Rohit Basfore Passed Away: సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది ప్రముఖులు మరణించారు. అయితే తాజాగా ‘ఫ్యామిలీ మ్యాన్’ నటుడు అనుమానాస్పద మృతి చెందాడు. ‘ఫ్యామిలీ మ్యాన్’ నటుడు రోహిత్ బాస్పోర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

అస్సాంలోని ఓ జలపాతం వద్ద రోహిత్ బాస్పోర్ మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీన్ని పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.